రిలీజ్ అయిన ‘చక్కిలి గింత’ ఫస్ట్ లుక్

రిలీజ్ అయిన ‘చక్కిలి గింత’ ఫస్ట్ లుక్

Published on Nov 2, 2014 3:09 PM IST

Chakkiligintha
‘అంతకముందు ఆ తరువాత’, ‘లవర్స్’ సినిమాలతో విజయం అందుకున్న సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న సినిమాకి ‘చక్కిలి గింత’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ సుకుమార్ స్నేహితుడైన వేమారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ రోజు హైదరాబాద్ లో రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమానికి ఈ చిత్ర టీం హాజరైంది.

నరసింహా రెడ్డి – నరసింహాచారి కలిసి మహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సుమంత్ అశ్విన్ సరసన రెహన హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీత మందిస్తున్న ఈ సినిమాలో చైతన్య కృష్ణ, తాగోబోతు రమేష్, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ఇలాంటి టైటిల్ బాగానే సరిపోతుంది. మరి ఇప్పటి వరకూ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో హిట్స్ అందుకున్న సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో కూడా హిట్ అందుకుంటాడేమో చూడాలి..

తాజా వార్తలు