లవర్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్న సుమంత్ అశ్విన్

లవర్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్న సుమంత్ అశ్విన్

Published on Aug 18, 2014 5:18 PM IST

sumanth-ashwin
సుమంత్ అశ్విన్ – నందిత జంటగా నటించిన సినిమా ‘లవర్స్’ గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే సప్తగిరి ఎపిసోడ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యింది.

ఈ సినిమా విజయంతో ఆనందంగా ఉన్న సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి సప్తగిరి ఎపిసోడ్ హైలైట్ అవుతుందని చెబుతున్నాం. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని మాత్రం అంచనా వేయలేదు. ప్రతి ఒక్కరూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత ఆసక్తిగా సెకండాఫ్ ని చూస్తున్నారు. సప్తగిరి ఎపిసోడ్ కి రెస్పాన్స్ చాలా బాగుందని’ అన్నాడు.

సక్సెఫుల్ డైరెక్టర్ మారుతి కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించిన ఈ సినిమా ద్వారా హరినాథ్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. సూర్యదేవర నాగ వంశీ – మహేంద్ర బాబు కలిసి నిర్మించిన ఈ సినిమాకి జెబి సంగీతం అందించాడు.

తాజా వార్తలు