విశాఖ అందాలు ఏ మాత్రం తగ్గలేదని తెలిపేందుకే ఆ పాటను చిత్రీకరించాం: సుమంత్ అశ్విన్

విశాఖ అందాలు ఏ మాత్రం తగ్గలేదని తెలిపేందుకే ఆ పాటను చిత్రీకరించాం: సుమంత్ అశ్విన్

Published on Dec 4, 2014 6:40 AM IST

Sumantha-Aswin
‘తూనీగ తూనీగ’, ‘అంతకుముందు ఆ తరువాత’, ‘లవర్స్’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుమంత్ అశ్విన్ ఈ శుక్రవారం ‘చక్కిలిగింత’ సినిమాతో మనముందుకు రానున్నాడు. వేమారెడ్డి అందించిన కధ తనను ఆశ్చర్యపరిచిందని, ఇప్పటివరకూ ఏ భాషలోనూ ఈ టైపు స్టోరీరాలేదని ప్రతీ ఒక్కరూ ఈ సినిమా చూసిన తరువాత కధ గురించి చర్చించుకుంటారని తెలిపాడు

అంతేకాక అవసరం లేకుండా ఫైట్ లు, లిప్ లాక్ లు సినిమాలో ఇరికించడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో నాలాంటి వాడు కూడా 10మందిని కొట్టే ఫైట్ సీన్ వుంటుంది, కానీ దానివెనుక ఒక లాజిక్ వుంటుంది. లిప్ కిస్ కాదుగానీ ఒక చిన్న పెక్ వుంటుంది కానీ దాని వెనుక ఒక కారణం వుంటుందని సుమంత్ చెప్పుకొచ్చాడు. హుదుద్ తీవ్ర నష్టం తరువాత కూడా విశాఖ అందాలు చెక్కు చెదరలేదని దానికి నిర్వచనంగా అక్కడ ఒక పాట చిత్రీకరించామని తెలిపాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు