డిఫరెంట్ టైటిల్ తో వస్తోన్న సుమంత్ !

మళ్ళిరావా సినిమాతో మంచి విజయం సాధించిన సుమంత్ ప్రస్తుతం అనిల్‌ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ ఒక థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రేమమ్ సినిమా హీరోయిన్ అంజు కురియెన్‌ ఈ మూవీ లో హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

తాజాగా ఈ సినిమా టైటిల్‌ లోగోను విడుదల చేశారు చిత్రయూనిట్‌. ఇదం జగత్ అనే డిఫరెంట్ టైటిల్ తో ఈ సినిమా రూపొందించబడుతోంది. ఈ మూవీలో సుమంత్‌ ఫొటో జర్నలిస్ట్‌ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.