
అక్కినేని ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయమైన హీరో సుమంత్.. కెరీర్ మొదట్లో మంచి విజయాలే వచ్చినా ఆ తర్వాత మాత్రం సరైన విజయాలు లేక సినిమాలు చేయడం తగ్గించాడు. బాగా గ్యాప్ తీసుకొని చేస్తున్న సుమంత్ చివరిగా చేసిన సినిమా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత బాగా లాంగ్ గ్యాప్ తీసుకున్న సుమంత్ తన తదుపరి సినిమా శివ నాగేశ్వరరావు డైరెక్షన్ లో చేయనున్నాడు.
శివ నాగేశ్వరరావు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోనున్నాడు. శ్రీ కాంత్ విస్సా కథని అందించిన ఈ సినిమాని అక్కినేని హోం బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ స్క్రిప్ట్ తో కచ్చితంగా హిట్ అందుకుంటానని సుమంత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.