‘మళ్ళీ రావా’ చిత్రం తో చాలా రోజుల తరువాత మంచి విజయాన్ని అందుకున్న హీరో సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇదం జగత్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ త్వరలోనే విడుదలకానుంది. ఇక టీజర్ విషయంలో సహాయం చేశాడట ‘గూఢచారి’ హీరో అడివి శేష్. ఈ విషయాన్ని సుమంత్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ టీజర్ బాగా రావడానికి కారకుడైన అడివి శేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
అంజు కురియన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం తెరకెక్కిస్తున్నారు. జొన్నలగడ్డ పద్మావతీ, శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.


