వరుస పరాజయాల తర్వాత ‘మళ్ళీ రావా’ సినిమాతో సక్సెస్ అందుకుని రీ ఎంట్రీ ఇచ్చిన హీరో సుమంత్ తన తర్వాతి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన తర్వాతి రేండు సినిమాలు థ్రిల్లర్ జానర్ కు చెందినవే కావడం విశేషం. ఆయన తాజాగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే సినిమా చేస్తున్నారు.
ఈ చిత్రంలో సుమంత్ దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా తన ప్రేయసికి ఇచ్చిన మాట కోసం దేవుడికి ఎదురుతిరిగే వ్యక్తిగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇక ఆయన పూర్తిచేసిన ‘ఇదమ్ జగత్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రాన్ని కూడ కొత్త దర్శకుడు అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తున్నారు.


