దండుపాళ్యం దర్శకుడితో యువ హీరో !

Published on Oct 31, 2018 5:08 pm IST

ఇటీవల ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చాడు యువ హీరో సుమంత్ అశ్విన్. ఇక ఈ చిత్రం కూడా పరాజయాన్నే మూటగట్టుకోవడంతో ఆయన తన తదుపరి చిత్రాన్ని భారీ గా ప్లాన్ చేసుకున్నాడు. ‘దండుపాళ్యం’ దర్శకుడు శ్రీనివాస రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ తన తదుపరి చిత్రంలో నటించనున్నాడు. ‘గరుడవేగ’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కోటేశ్వరరాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈచిత్రం తెలుగు తోపాటు , కన్నడ , తమిళ , మలయాళ భాషల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. నవంబర్ 2వ వారంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మణిశర్మ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :