భారీ ధర పలికిన సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ ఓవర్శిస్ హక్కులు !

భారీ ధర పలికిన సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ ఓవర్శిస్ హక్కులు !

Published on Aug 22, 2018 10:46 PM IST

Subramayapuram

మళ్ళీ రావా చిత్రం తరువాత సుమంత్ నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా ఫై అంచనాలు పెంచేసిన ఈచిత్రం తాజాగా ఓవర్శిస్ హక్కులతో మరో మరో సారి వార్తల్లో నిలిచింది. ఇక ఈ సినిమా ఓవర్శిస్ హక్కులను భారీ ధరకు కంట్రీ సైడ్ అధినేతలు దక్కించుకున్నారట. ఇప్పటివరకు సుమంత్ నటించిన చిత్రాల్లో అక్కడ ఈ చిత్రానికే అత్యధిక ధర పలకడం విశేషం.

నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తెరక్కిస్తున్న ఈచిత్రంలో తెలుగు అమ్మాయి ఈశా రెబ్బ కథానాయికగా నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సుమంత్ 25 వ చిత్రం గా రానున్న ఈసినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే వున్నాయి.

తాజా వార్తలు