సమీక్ష : సుమతీ శతకం – సింపుల్ ప్లేతో సాగే లవ్ డ్రామా !

సమీక్ష : సుమతీ శతకం – సింపుల్ ప్లేతో సాగే లవ్ డ్రామా !

Published on Feb 6, 2026 8:32 PM IST

Sumathi Sathakam

విడుదల తేదీ : ఫిబ్రవరి 06, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అమర్‌దీప్ చౌదరి, శాయిలీ చౌదరి, జేడీవీ ప్రసాద్, టేస్టీ తేజ, కరన్ విజయ్, మిర్చీ కిరణ్ తదితరులు
దర్శకుడు : ఎం.ఎం.నాయుడు
నిర్మాణం : కొమ్మలపాటి సాయి సుధాకర్
సంగీతం : సుభాష్ ఆనంద్
ఛాయాగ్రహణం : హలేష్ ఎస్
కూర్పు : నాహిద్ ఎం

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

అమర్‌దీప్ చౌదరి వెండితెరపై హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆయన నటించిన ‘సుమతీ శతకం’ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

కృష్ణ (అమర్‌దీప్ చౌదరి) తన చిన్న తనం నుంచే పెళ్లి పై విపరీతంగా ఇష్టాన్ని పెంచుకుంటాడు. తన ఊరిలో ఒక కిరాణా షాపు నడుపుతూ సరదాగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. మరోవైపు పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కృష్ణ సుమతీ (శాయీలీ చౌదరి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెను ప్రేమలో పడేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు తన ప్రేమ గురించి కృష్ణ ఆమెకు చెబుతాడు. శుక్రవారం గుడికి రమ్మని ఆమె కృష్ణకి చెబుతుంది. అసలు ఆమె ఎవరు ?, అసలు వీరి ప్రేమకథకు ఆ ఊరిలోని మూఢనమ్మకాలు, కఠినమైన సంప్రదాయాలు ఎలా అడ్డుగా నిలిచాయి ?, తన ప్రేమను గెలిపించుకోవడానికి కృష్ణ ఏం చేశాడు ?, ఈ క్రమంలో తన ‘సుమతి’ మనసును ఎలా గెలుచుకున్నాడు ? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

పెళ్లి కోసం ఆశగా చూసే కుర్రాడికి.. తను ప్రేమించిన అమ్మాయి గురించి అసలు నిజం తెలిసి ఎలా ఫీల్ అయ్యాడు ?, అసలు ఆమెను ప్రేమించే పరిస్థితి లేదని తెలిసి ఎలా రియాక్ట్ అయ్యాడు?, ఈ మధ్యలో ఊరి కట్టుబాట్లు, ఆచారాలు.. వీటికి తోడు మానసిక సంఘర్షణ.. ఇలా మొత్తంగా ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ పర్వాలేదు. అలాగే ఫన్ తో సాగే లవ్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ బాగున్నాయి.

ఇక ఈ సినిమాలో అమర్‌దీప్ చౌదరి పోషించిన ప్రధాన పాత్ర అయిన క్రిష్ణ  పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన పెళ్లి ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్.. ఇలా  మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు. హీరోయిన్ శాయిలీ చౌదరి కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. అలాగే తన గ్లామర్ తో సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరో కీలక పాత్రల్లో నటించిన జేడీవీ ప్రసాద్ – టేస్టీ తేజ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా  తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘సుమతీ శతకం’ స్క్రీన్ ప్లే  బాగా స్లోగా సాగింది. అలాగే,  సినిమాలో కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఐతే, దర్శకుడు పనితనం, నటీనటుల నటన సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… కథ కథనాల్లో ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి.

దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతూ విసిగిస్తాయి. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్  పర్వాలేదకున్నా.. మిగిలిన కంటెంట్ ఆసక్తికరంగా అయితే సాగలేదు. ఇక సినిమా నిడివి కూడా ఎక్కువే ఉంది. ఇలాంటి సినిమా తక్కువ నిడివిలో ఉండి ఉంటే,  ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. మరి దర్శకనిర్మాతలు ఆ కోణంలో ఎందుకు ఆలోచించలేదో వాళ్లకే తెలియాలి. పైగా సన్నివేశాలు కూడా చాలా రెగ్యులర్ గా సాగాయి.

సాంకేతిక విభాగం : 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే..  లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ హలేష్ ఎస్ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది.  ఎడిటింగ్ షార్ప్ గా ఉండాల్సింది. ఈ చిత్ర నిర్మాత కొమ్మలపాటి సాయి సుధాకర్  పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు:

‘సుమతీ శతకం’ అంటూ వచ్చిన ఈ లవ్ అండ్ కామెడీ డ్రామాలో  కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి. ఇక సినిమాలో ఇంటర్వెల్ బాగుంది.  ఐతే, కథ కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని లవ్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు