‘డిసి’ రన్ టైం రూమర్స్ కి చెక్ పెట్టిన మేకర్స్!

‘డిసి’ రన్ టైం రూమర్స్ కి చెక్ పెట్టిన మేకర్స్!

Published on Aug 5, 2026 4:01 PM IST

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ వైలెంట్ యాక్షన్ చిత్రం తమిళ్ సహా తెలుగులో కూడా విడుదల కాబోతుంది. అయితే మేకర్స్ ఈ చిత్రానికి ముందే అఫీషియల్ రన్ టైం ని రివీల్ చేశారు.

కానీ మళ్ళీ సోషల్ మీడియాలో ఈ సినిమా నిడివి ఏకంగా 3 గంటలు ఉందని పలు రూమర్స్ చక్కర్లు కొట్టడం మొదలైంది. మరి దీనికి చెక్ పెడుతూ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కేవలం రెండు గంట 23 నిమిషాల నిడివితోనే రాబోతుంది అని ఖరారు చేశారు. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ ఆగష్టు 7న సినిమా విడుదల కాబోతుంది.

తాజా వార్తలు