“బాహుబలి”గా వార్నర్..మైండ్ బ్లాక్ చేసిన సన్ రైజర్స్.!

Published on Apr 3, 2021 8:00 am IST

ఇండియన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ఏదన్నా ఉంది అంటే అంతా ముక్త కంఠంతో చెప్పే పేరు “బాహుబలి”. మన తెలుగు నుంచి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా ఉంది. మరి ఈ సినిమా క్రేజ్ ను ఎలా వాడుకోవాలో అలా అనేక మంది వాడుకున్నారు. మరి వారిలో క్రికెటర్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్సమెన్ డేవిడ్ వార్నర్ ఓ వీడియో చెయ్యగా భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఇదే డేవిడ్ వార్నర్ పై మన హైదరాబాద్ ఐపీఎల్ టీం అదిరే పోస్టర్ ను విడుదల చేసింది. గత కొన్ని రోజులు నుంచి వారి టీం మెంబర్స్ పై సూపర్బ్ ఎడిట్స్ మన స్టార్ హీరోస్ పై చేసి అదరగొడుతున్నారు.

మరి అలా ఇప్పుడు వార్నర్ ను “బాహుబలి”గా ప్రాజెక్ట్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ ఎడిట్ తో వచ్చారు. ప్రభాస్ ది ఇంటెన్స్ పోస్టర్ ను వార్నర్ గా ఎడిట్ చేసి వదలగా ఓ పక్క సన్ రైజర్స్ అభిమానులు మరోపక్క ప్రభాస్ అభిమానులు కూడా సూపర్బ్ రెస్పాన్స్ అందిస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ పోస్టర్ సూపర్బ్ గానే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :