మరోసారి జతకట్టనున్న సందీప్ రెజినా

Sundeep-Kishan-and-ragina
సందీప్ కిషన్ మరియు రెజినా జంటగా నటించిన ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘రారా కృష్ణయ్య’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినా వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదరడంతో ప్రేక్షకాధరణ పొందారు. ఈ జంట మరోసారి తమిళ చిత్రంలో కనిపించనున్నారు.

ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో లోకేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చెయ్యలేదు. ఈ దర్శకుడు లఘు చిత్రాల ద్వారా బాగా ప్రసిద్ధి చెందాడు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగుతుందన్న విషయం చిత్ర బృందం స్పష్టం చేశారు

సందీప్ తమిళంలో నటించిన యారుడా మహేష్ తెలుగులో మహేష్ గా విడుదలకానుంది. సందీప్ ప్రస్తుతం టైగర్ సినిమాలో నటిస్తున్నాడు. రెజినా హరీష్ శంకర్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలో నటిస్తుంది

Exit mobile version