సేతుపతితో సాలిడ్ యాక్షన్ లో “మైఖేల్” గా సందీప్ కిషన్!

Published on Aug 27, 2021 10:31 am IST


ప్రెజెంట్ మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కూడా ఒకడు. పలు ఆసక్తికర చిత్రాలతో సన్నద్ధం అవుతున్న సందీప్ కిషన్ నుంచి మరో ఆసక్తికర చిత్రం అనౌన్స్ అయ్యింది. అదే “మైఖేల్” టైటిల్ తో వెరీ ఇంట్రెస్టింగ్ పోస్టర్ డిజైన్ తో మేకర్స్ అనౌన్స్ చేశారు. రంజిత్ జేయకొడి దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

అలాగే సేతుపతి సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించనున్నాడట. ఇక పోస్టర్ గమనిస్తే బాగా దెబ్బ తిని ఉన్న రెండు చేతులు వేటలో ఒకదానికి సంకెళ్లు కనిపిస్తుండం ఆసక్తి రేపుతోంది. మరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా భరత్ చౌదరి మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు లు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం నుంచి మిగతా క్యాస్టింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి చేయనున్నారు.

సంబంధిత సమాచారం :