‘సిగ్మా’ టీజర్ టాక్ : గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్‌తో దిగుతున్న సందీప్ కిషన్

‘సిగ్మా’ టీజర్ టాక్ : గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్‌తో దిగుతున్న సందీప్ కిషన్

Published on Dec 23, 2025 5:31 PM IST

SIGMA

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సిగ్మా’ తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ వారసుడు సంజయ్ జేసన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక తాజాగా ఈ మూవీ నుండి టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్ ఆద్యంతం రేసీగా కట్ చేశారు. చకచకా పరిగెత్తే స్క్రీన్ ప్లే‌తో ఈ టీజర్ కట్ ఎంగేజింగ్‌గా కూడా ఉంది. తనను తాను కాపాడుకునేందుకు ఎలాగైనా మారడానికి సిద్ధపడే హీరో కథే ఈ సినిమాగా ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బోలెడు ఉండబోతున్నట్లు ఈ గ్రిప్పింగ్ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో సందీప్ చేసే యాక్షన్ ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు