రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సందీప్ “గల్లీ రౌడీ”

Published on Aug 15, 2021 12:32 pm IST


ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ సినిమాల నుంచి రిలీజ్ డేట్ల కన్ఫర్మేషన్ పర్వం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు కూడా ఎన్నో సినిమాలు ఇప్పుడు తమ కొత్త రిలీజ్ డేట్లను ప్రకటించుకోవడంతో పాటుగా ఒక్కక్కటిగా రిలీజ్ కూడా అవుతున్నాయి. మరి ఇప్పుడు ఈ లిస్ట్ లో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా యువ హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం “గల్లీ రౌడీ” కూడా చేరింది.

జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే సెప్టెంబర్ 3న రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా ఈరోజు ఆగష్టు 15 సందర్భంగా అనౌన్స్ చేసారు. ఇప్పటికే మంచి బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం కూడా ఎట్టకేలకు రెడీ అయ్యింది. ఇక ఈ చిత్రానికి సాయి కార్తీక్ మరియు రామ్ మిర్యాల సంగీతం అందిస్తుండగా కోన వెంకట్ మరియు ఎంవీవీ సత్యన్నారాయణ ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :