ఉగాది రోజున సందీప్ కిషన్ ‘టైగర్’ విడుదల..

ఉగాది రోజున సందీప్ కిషన్ ‘టైగర్’ విడుదల..

Published on Feb 24, 2015 7:26 PM IST

tiger
సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా ‘టైగర్’. ఉగాది కానుకగా మార్చి 21న ఈ సినిమాను విడుదల సన్నాహాలు చేస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటివలే విడుదలైంది. పాటలకు మంచి స్పందన లభించింది.

ఏఆర్ మురుగదాస్ శిష్యుడు విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీరత్ కపూర్ హీరోయిన్. ఈ సినిమాలో సందీప్ కిషన్ కేవలం ఇంటర్వెల్ కు 10 నిముషాల ముందే సినిమాలో ఎంటర్ అవుతాడు. గంగానది నేపథ్యంలో విభిన్న కథాంశంతో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై సందీప్ కిషన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

తాజా వార్తలు