మాస్ ని మెప్పించడానికి సిద్దమైన యంగ్ హీరో

Sundeep_Kishan

యంగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పటి వరకూ ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకూ తను చేసిన సినిమాల్లో అక్కడక్కడా మాస్ ఎలిమెంట్స్ ఉన్నా తన కెరీర్లో మొదటి సారి ఫుల్ లెంగ్త్ మాస్ పాత్ర చేసిన సినిమా ‘టైగర్’. ఈ సినిమాలో తన పాత్ర మాస్ ఆడియన్స్ ని అమితంగా మెప్పిస్తుందని, అలాగే తన కెరీర్ కి చాలా పెద్ద హెల్ప్ అవుతుందని సందీప్ కిషన్ భావిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ లో సందీప్ కిషన్ బాడీ లాంగ్వేజ్ మరియు మాస్ లుక్ అందరినీ మెప్పించింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ తో పాటు రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ లు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ఎఆర్ మురుగదాస్ అసిస్టెంట్ విఐ ఆనంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఠాగోర్ మధు – ఎన్వీ ప్రసాద్ కలిసి ఈ సినిమాని నిర్మించారు.

Exit mobile version