సందీప్ కిషన్ కృష్ణయ్యగా మెప్పిస్తాడా.?

సందీప్ కిషన్ కృష్ణయ్యగా మెప్పిస్తాడా.?

Published on Jul 4, 2014 8:32 AM IST

sandeep-kishan

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా, అందాల భామ రెజీన కసాండ్ర హీరోయిన్ గా తెరకెక్కిన ‘రారా కృష్ణయ్య’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా హిట్ తర్వాత సందీప్ కిషన్ సోలో హీరోగా చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో అనేది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. సందీప్ కిషన్ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మరి ఆడియన్స్ ఆ నమ్మకాన్ని నిజం చేసారో లేదో అనేదాన్ని మరికొద్దిసేపట్లో మేము అందిస్తాం.

సందీప్ కిషన్ కి అన్న పాత్రలో జగపతి బాబు కనిపిస్తున్న ఈ సినిమా ద్వారా మహేష్ బాబు.పి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. జగపతి బాబుకి జోడీగా కళ్యాణి కనిపిస్తున్న ఈ సినిమాకి వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో కూడా మరో హిట్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నాడు.

తాజా వార్తలు