
‘రొటీన్ లవ్ స్టొరీ’ సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ – రెజీన కసాండ్ర హీరో హీరోయిన్స్ గా రెండవ సారి జోడీ కట్టిన సినిమా ‘రారా కృష్ణయ్య’. ఈ సినిమా గత ఏడాది జూలై 4న రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ గా నిలిచింది. అలాగే నిర్మాతలకి కూడా లాభాలనే తెచ్చి పెట్టింది. మహేష్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాకి వంశీ కృష్ణ నిర్మాత. ఈ సినిమా గత ఏడాది చిన్న సినిమా వచ్చి విజయం అందుకున్నా శాటిలైట్ రైట్స్ మాత్రం రీసెంట్ గానే డీసెంట్ ప్రైజ్ కి అమ్ముడు పోయాయి.
ఈ సినిమా వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా అదరగొట్టింది. ఎలా అనుకుంటున్నారా.. ఇటీవలే ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కొనుక్కున్న మా టీవీ వారు ఆగష్టు 30న ఈ సినిమాని ఫస్ట్ టైం టీవీలో టెలికాస్ట్ చేసారు. మొదటి సరి ఈ సినిమాకి మంచి టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది. ఆగష్టు 30న ఈ సినిమాకి 7.8 టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది. అంటే ఆ రోజు అందరూ ఈ సినిమా చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపారు. బుల్లితెరపై కూడా ఈ సినిమాని ఇంతలా ఆదరించడంతో హీరో సందీప్ కిషన్ చాలా హ్యాపీగా ఉన్నాడు. సందీప్ కిషన్ చేస్తున్న నెక్స్ట్ తమిళ్ మూవీ చివరి దశకు చేరుకుంది.