యువనటుడు సందీప్ కిషన్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక చోటు సంపాదించుకోవడం కోసం కృషి చేస్తున్నాడు. చాలా రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘టైగర్’ విడుదల కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.ఎ ఆర్ మురుగుదాస్ దగ్గర సహాయ దర్శకునిగా పనిచేసిన వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సాధిస్తున రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు.
నిర్మాతలు ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ‘టైగర్’ మే రెండో వారంలో విడుదల కానుందని తెలిపారు. ఇంకా తారీఖు ఖరారు కావల్సివుంది. పవిత్రమైన కాశి చుట్టూ తిరిగే ఈ చిత్రం కమర్షియల్ విజయంతో పాటు ప్రేక్షకులని అలరిస్తుందని అంచనాలు వున్నాయి.
యెన్ వి ప్రసాద్ టాగోర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం వహించారు. ఈ చిత్రం ఆడియో ఫిబ్రవరి లో విడుదల అయ్యింది.


