తనతో చేయడం థ్రిల్ అంటున్న సందీప్ కిషన్

తనతో చేయడం థ్రిల్ అంటున్న సందీప్ కిషన్

Published on Nov 14, 2015 12:37 PM IST

Sundeep-Kishen-nitya
ఈ ఏడాది ‘టైగర్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ చేస్తున్న తదుపరి తెలుగు సినిమా ‘ఒక అమ్మాయి తప్ప’. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ని సెలక్ట్ చేయాలని మొదటి నుంచీ ట్రై చేస్తున్న ఈ చిత్ర టీం ఫైనల్ గా టాలెంట్ అండ్ స్టార్ ఇమేజ్ ఉన్న నిత్యా మీనన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారని ఇది వరకే తెలియజేశాం. నిత్యా మీనన్ తో కలిసి పనిచేయడాన్ని థ్రిల్ గా ఫీలవుతున్నాడు హీరో సందీప్ కిషన్.

రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘సూపర్ టాలెంట్ ఉన్న హీరోయిన్ నిత్యామీనన్.. తనతో కలిసి పనిచేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నిత్యా మీనన్ టైటిల్ లో చెప్పిన ఒక అమ్మాయి అనే పాత్రలో కనిపిస్తుందని’ తెలిపాడు. అలాగే సందీప్ కిషన్ సినిమా కథ ఎలా ఉంటుందనే దాని గురించి చెబుతూ ‘ ఇది విధి నడిపించే ప్రేమకథ.. ఎవరి దారిలో వారు వెళ్తున్న ఇద్దరినీ పలు సందర్భాలు ఎలా కలిపాయి అన్న పాయింట్ ని బేస్ చేసుకొని ఈ సినిమా కథ ఉంటుందని’ సందీప్ కిషన్ తెలిపాడు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందనున్న ఈ సినిమాకి రాజసింహ దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్, చోటా కె నాయుడు, అనల్ అరసు ఇలా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమాలో విలన్‌గా రవి కిషన్ కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు