సంక్రాంతిని టార్గెట్ చేసిన సునీల్.!!

సంక్రాంతిని టార్గెట్ చేసిన సునీల్.!!

Published on Nov 9, 2015 8:35 AM IST

sunil
ప్రతి సంక్రాంతి సీజన్ లోనూ కచ్చితంగా ఇద్దరు స్టార్ హీరోస్ బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సమాచారం ప్రకారం రానున్న 2016 సంక్రాంతి సీజన్ మరింత రసవత్తరంగా మారింది. షూటింగ్ ఆలస్యం కావడం వలన మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’, పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మరియు నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’ సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలో మిగిలాయి.

తాజాగా ఈ లిస్టులో కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా వచ్చి చేరింది. వీటితో పటు తమిళ స్టార్ సూర్య నటించిన ’24’ సినిమాని కూడా సంక్రాంతికే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ నాలుగు సినిమాల పక్కన మరో సినిమా కూడా వచ్చి చేరింది. అదే సునీల్ హీరోగా నటించిన ‘కృష్ణాష్టమి’. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా దాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం సరైన డేట్ ని చూస్తున్న దిల్ రాజు సంక్రాంతి సీజన్ అయితే బెటర్ అని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పుడున్న షెడ్యూల్స్ ప్రకారం ఏదీ పోస్ట్ పోన్ కాకపోతే 5 సినిమాలు ఈ సారి సంక్రాంతి సీజన్ లో తమ సత్తాని చాటుకోవడానికి సిద్దమవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు