సునీల్ రెమ్యూనరేషన్ తగ్గించాడట !

సునీల్ రెమ్యూనరేషన్ తగ్గించాడట !

Published on Aug 2, 2018 11:50 AM IST

Sunil

కమెడియన్ గా బిజీ గా ఉంటూ ఒక్క సారిగా హీరో గా టర్న్ తీసుకున్నాడు ప్రముఖ నటుడు సునీల్. ఇటీవల ఆయనచేసిన సినిమాలు పరాజయాలు చవిచూడడంతో మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆయన రవితేజ , శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ ‘చిత్రంతో పాటు ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలతో పాటు భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సిల్లీ ఫెలోస్’ చిత్రంలో అల్లరి నరేష్ తో కలిసి నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఈ ఇద్దరి హీరోలు సమానంగా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇక ఈ చిత్రానికి సునీల్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడట. మాములు గా ఒక సినిమాకి సునీల్ ఇంతకుముందు 4కోట్ల వరకు ఛార్జ్ చేసేవాడట. అయితే ఇటీవల ఆయన సినిమాలు పరాజయం చెందడంతో ఈచిత్రానికి కేవలం 1.5కోట్ల రెమ్యూనరేషన్ ను మాత్రమే తీసుకున్నాడని సమాచారం. ఇక మరో హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రానికిసునీల్ తో సమానంగా అంతే పారితోషికాన్ని తీసుకున్నాడట.

తాజా వార్తలు