హీరోగా సునీల్ మరో సినిమా !

‘అహనా పెళ్ళంట’ సినిమాతో దర్శకుడిగా మారిన వీరభద్రం చౌదరి ఆ సినిమా తరువాత సునీల్ తో ‘పూల రంగడు’ సినిమా తీసాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తాజా సమాచారం మేరకు వీరభద్రం సునీల్ తో మరో సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్న ఈ సినిమా త్వరలో అనౌన్స్ కాబోతోంది.

నిర్మాత అంజిరెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. గతంలో ఈ నిర్మాత సందీప్ కిషన్ తో ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాను నిర్మించడం జరిగింది. సునీల్ వీరభద్రం సినిమాకు సంభందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీనువైట్ల, త్రివిక్రమ్ సినిమాలలో మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సునీల్ కథ నచ్చడంతో వీరభద్రంతో హీరోగా చెయ్యడానికి ఒప్పుకున్నాడట.