చిరు , కొరటాల సినిమాలో ప్రముఖ కమెడియన్ !

Published on Apr 16, 2019 8:17 am IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో వున్నారు. ఈ చిత్రం తరువాత చిరు , టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 152 వచిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా కి స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు కొరటాల.

ఇక ఈ చిత్రం లో ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సునీల్ ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం. అయితే గతంలో ఖైదీ నెంబర్ 150లో నటించే అవకాశం వచ్చిన డేట్స్ కాలి లేకపోవడంతో ఈ ఆఫర్ ను వదులుకున్నాడు. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తో కలిసే నటించే అవకాశం రావడంతో సునీల్ చాలా హ్యాపీ గా ఉన్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ,మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :