సునీల్ సరసన హీరోయిన్‌గా నిక్కి

Nikki-Galrani
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సునీల్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యింది. ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’ ఫేం సంజన సిస్టర్ నిక్కి గార్లని సునీల్ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. తమిళ మరియు కన్నడ సినిమాలలో నటించిన నిక్కి గార్లనికి తెలుగులో ఇదే తొలి సినిమా. ‘ప్రేమకథా చిత్రమ్’ తమిళ రీమేక్ ‘డార్లింగ్’లో నిక్కి నటన చూసి ఇంప్రెస్స్ అయిన దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశం ఇచ్చారు.

‘జోష్’ ఫేం వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. కోన వెంకట్ రచయితగా పని చేస్తున్న ఈ సినిమాకు దినేష్ సంగీతం అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

Exit mobile version