ఆగష్టు నుండి సునీల్ – వాసు వర్మల మూవీ

ఆగష్టు నుండి సునీల్ – వాసు వర్మల మూవీ

Published on Jul 8, 2014 8:37 AM IST

vasun-varma-sunil
కమెడియన్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన సునీల్ హీరోగా మారిన తర్వాత మొదట్లో మంచి హిట్ సినిమాలు చేసాడు. కానీ కొద్ది రోజులుగా సరైన హిట్ లేక డీలా పడిపోయిన సునీల్ ప్రస్తుతం ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నాడు. ఇటీవలే ‘జోష్’ సినిమా డైరెక్టర్ వాసు వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని తెలిపాము. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగష్టు నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది.

టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నాడు. దిల్ రాజు ఈ సినిమా ఆగష్టు లో మొదలవుతుందని ఖరారు చేయడమే కాకుండా, సునీల్ స్టైల్లో సాగే ఈ పూర్తి ఎంటర్టైనర్ అని తెలిపాడు. ఈ సినిమాకి సంబందించిన మిగతా వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సునీల్ తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా మారుతి, గోపి మోహన్ లతో కూడా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తాజా వార్తలు