కొత్త సినిమాని మొదలుపెట్టనున్న సునీల్ !

sunil new
హీరో సునీల్ గత రెండు సినిమాలు ‘జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే’ లు పెద్దగా విజయం సాధించకపోవడంతో కాస్త డీలా పడి రేబీడు కొత్త చిత్రాల్ని ప్రారంభించారు. అందులో ఒకటి క్రాంతి మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఉంగరాల రాంబాబు’ కాగా మరొకటి ఎన్. శంకర్ డైరెక్ట్ చేయనున్న సినిమా ఒకటి. వీటిలో ముందుగా ఎన్. శంకర్ సినిమాని మొదలుపెడుతున్నారు సునీల్. మలయాళ చిత్రం ‘టూ కంట్రీస్’ స్టోరీని తెలుగు నేటివిటీకి సరిపోయేలా తగిన మార్పులు చేసి రీమేక్ చేస్తున్నారు.

ఎన్. శంకర్ తన మహా లక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనుందట. ‘ఊపిరి, ప్రేమమ్’ లాంటి సినిమాలకు సంగీతం అందించిన గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. పృథ్వి, పోసాని, రాజా రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి వంటి నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Exit mobile version