‘శ్రీమంతుడు’ సక్సెస్‌తో సూపర్ స్టార్ మహేష్ అంతటా హాట్ టాపిక్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సక్సెస్‌ను కొద్ది రోజుల పాటు ఎంజాయ్ చేసిన మహేష్ వెంటనే తన కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’ కోసం సిద్ధమవుతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి అందమైన సినిమా తర్వాత మహేష్- దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే మంచి అంచనాలున్నాయి.
ఇప్పటికే సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లతో పాటు ఇతర భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా హీరో సునీల్ కూడా చేరిపోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బ్రహ్మోత్సవంలో సునీల్ ఓ స్పెషల్ రోల్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఖలేజా తర్వాత కమెడియన్ పాత్రలకు స్వస్తి చెప్పి, హీరోగానే కొనసాగుతూ వస్తోన్న సునీల్ మళ్ళీ బ్రహ్మోత్సవం సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయనున్నారనే వార్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదీ రాలేదు. పీవీపీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా ఈనెల్లోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.


