
ఏంటీ.. కరెంట్ తీగ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రఖ్యాత శృంగార తార సన్నీ లియోన్.. ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’లో నటిస్తుందా? అనుకుంటున్నారా ? విషయం అది కాదు. ఈ సినిమాలో సన్నీ లియోన్ పేరు మీద ఓ ఐటమ్ సాంగ్‌ను తయారు చేశారట. ఈ ఐటమ్ సాంగ్‌కు ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..’ ఫేం జెన్నీఫర్‌ను ఎంచుకున్నారు. తాజాగా ఈ సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రిన్స్ హీరోగా జ్యోతిసేథీ, సంపూర్ణేష్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించగా.. శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై నిర్మించబడ్డ చిత్రం.. ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి నిర్మించారు. శ్రీనివాస్ దర్శకుడు. ఆసక్తికరమైన టైటిల్, కథాంశంతో చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్‌గా సినిమాని తీర్చిదిద్దామనీ, రెండో వారంలో ఆడియోను, ఈనెల చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

