150 కోట్ల మార్కు చేరువలో సూపర్ 30

Published on Aug 15, 2019 2:00 am IST

హృతిక్ రోషన్ తాజాగా చేసిన సూపర్ 30 మూవీకి ఫిలిం క్రిటిక్స్ తోపాటు,సర్వత్రా ప్రశంసలు అందాయి. బీహార్ కి చెందిన గణిత మేధావి ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఒక మధ్యతరగతి వర్గానికి చెందిన టీచర్ పాత్రలో హృతిక్ అద్భుతంగా నటించారు. కాగా ఈ చిత్రం 150కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గత నెల12న విడుదలైన సూపర్ 30మూవీ ఈ ఐదు వారాలలో 146.10 కోట్ల వసూళ్లు సాధిందని తెలుస్తుంది.

ఇక ఈచిత్రానికి వికాస్ బాల్ దర్శకత్వం వహించగా, అజయ్,అతుల్ సంగీతం అందించారు. పాంథమ్ ఫిలిమ్స్, నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్, రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

సంబంధిత సమాచారం :