తెలుగు సినిమా పరిశ్రమ ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం బాలీవుడ్ ని సైతం దాటుకుని ముందుకి సాగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఇక్కడి నుండి వస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాలు, అవి చేస్తున్న దర్శకులు, నటులు, నిర్మాతలు అందరూ కూడా తమకంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపుని అందుకుంటున్నారు.
ఇక ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అల్లు అర్జున్ కి లభించింది. అలానే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ కి బెస్ట్ పాపులర్ ఫిలిం ఫర్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డు దక్కింది.
అలానే ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీకి నేషనల్ ఇంటిగ్రిషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు దక్కింది. అయితే మ్యాటర్ ఏమిటంటే, నేడు జాతీయ అవార్డుల వేడుక ఢిల్లీలో వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అవార్డులని అందుకోవడం కోసం అక్కడకి వెళ్లిన రాజమౌళి, అల్లు అర్జున్, అభిషేక్ అగర్వాల్ కలిసి దిగిన సూపర్ క్లిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
