సూపర్ క్లిక్ : క్రికెట్ సూపర్ స్టార్ తో మాలీవుడ్ సూపర్ స్టార్

సూపర్ క్లిక్ : క్రికెట్ సూపర్ స్టార్ తో మాలీవుడ్ సూపర్ స్టార్

Published on Sep 24, 2023 12:00 AM IST

Dhoni

ఇండియన్ క్రికెట్ లో గొప్ప పేరు సంపాదించిన పలువురు క్రికెటర్స్ లో ఎమ్ ఎస్ ధోని కూడా ఒకరు. ధోని కి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ విధంగా అటు కీపింగ్ తో పాటు బ్యాట్స్ మ్యాన్ గా కూడా తన టాలెంట్ నిరూపించుకున్నారు ధోని. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ధోని తాజాగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి LGM మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఇక అక్కడక్కడ పలు యాడ్స్ లో కూడా ఆయన నటిస్తున్నారు.

మరోవైపు మాలీవుడ్ లో నటుడిగా ఎన్నో గొప్ప సినిమాల్లో అత్యద్భుత పాత్రలు చేసి అటు మలయాళం తో పాటు అనేక ఇతర భాషల ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు మోహన్ లాల్. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా క్రికెట్ సూపర్ స్టార్ ధోని, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇద్దరూ కలిసి ఒక యాడ్ చేస్తున్నారు. ఆ యాడ్ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన పిక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ ఇద్దరి కలయికలో ఒక సినిమా కనుక వస్తే నిజంగా కన్నుల పండుగే అంటూ పలువు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు