శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘రన్ రాజా రన్’. ఘిబ్రాన్ సంగీతం అందించారు. ఆగస్ట్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, వెన్నెల కిషోర్ ల కామెడీ హైలైట్ అని సమాచారం.
‘రన్ రాజా రన్’ చిత్రంలో కోట, వెన్నెల తండ్రికొడుకులుగా నటిస్తున్నారు. తండ్రికి పుత్రోత్శాహం కలిగించాలనే పాత్రలో వెన్నెల నటిస్తున్నారు. కొడుకు చేష్టలను భరించలేని తండ్రి పాత్రలో కోట కనిపిస్తారు. వీరి పిచ్చి ప్రేమ కామెడీ చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చిత్రబృందం చెప్తున్నారు.


