బాలయ్య డైరెక్టర్ తో సూపర్ గుడ్ ఫిలిమ్స్ మూవీ..!

Published on May 26, 2020 6:13 pm IST

సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ అంటే సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వు వస్తావని, అందాల రాముడు వంటి హిట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. తెలుగు మరియు తమిళంలో అనేక చిత్రాలు నిర్మించిన ఆర్ బి చౌదరి బ్యానర్ లో మూవీ అంటే సూపర్ హిట్ అన్నట్లుగా, ప్రేక్షకులకు వీరు మంచి చిత్రాలు అందించారు. మరి ఈ హిట్ చిత్రాల నిర్మాత ఆర్ బి చౌదరి సీనియర్ దర్శకుడు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో మూవీ చేయడానికి సిద్ధం అయ్యారట.

విజయ్ సేతుపతి మరియు సత్య రాజ్ ప్రధాన భాషలలో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే వీరి మధ్య ఒప్పందం కుదిరిందిట. లాభాలలో వాటాల ఆధారంగా సత్యరాజ్ మరియు విజయ్ సేతుపతి ఈమూవీలో భాగస్వాములు అయ్యారని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొద్ది రోజులలో ఈ మూవి సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. ఇక గత ఏడాది చివర్లో కె ఎస్ రవికుమార్ బాలయ్యతో రూలర్ మూవీ చేశారు. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.

సంబంధిత సమాచారం :

More