“బతుకు బస్టాండ్” సాంగ్ కు సూపర్ రెస్పాన్స్.!

“బతుకు బస్టాండ్” సాంగ్ కు సూపర్ రెస్పాన్స్.!

Published on Jun 24, 2021 1:09 PM IST

నూతన నటీనటులు విరాన్ ముత్తంశెట్టి హీరోగా నికిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్స్ గా పరిచయం అవుతున్న తాజా సినిమా “బతుకు బస్టాండ్”. మరి ఇలవల ఫిల్మ్స్ పతాకం పై చక్రధర్ రెడ్డి సమర్పణలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. బ‌తుకు బ‌స్టాండ్ అనే టైటిల్ పెట్టిన‌ట్లుగా ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఈ సినిమా పై ఆస‌క్తి పెరిగుతూ వ‌స్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు సోష‌ల్ మీడియాలో అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది.

ఇటీవ‌లే విడుద‌లైన మొద‌టి పాట యూట్యూబ్ లో విశేషాద‌ర‌ణ అందుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా విడుద‌లైన‌ బ్రేజిలియ‌న్ మోడ‌ల్ జెన్నీఫ‌ర్ పిక్కినాటో చిందేసిన బుస్సా బుస్సా అంటూ సాగే ఓ మాస్ ఐట‌మ్ సాంగ్ కు సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఐ.ఎన్. రెడ్డి తెలిపారు, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసింద‌ని, త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా చిత్ర నిర్మాత‌లు తెలిపారు.

ఇక ఈ చిత్రం టెక్నికల్ టీం విషయానికి వస్తే బ్యానర్ : ఇలవల ఫిల్మ్స్, సమర్పణ : కె చక్రధర్ రెడ్డి, రచన, దర్శకత్వం : ఐ ఎన్ రెడ్డి, నిర్మాతలు : ఐ కవితా రెడ్డి, కె మాధవి, డిఓపి : వాస్ కమల్, సంగీతం : మహవీర్, పీఆర్ఓ : ఏలూరు శ్రీను & మేఘ శ్యామ్, కొరియోగ్రఫీ : శివాజీ, యాక్షన్ : శంకర్ యూ లు అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు