‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమా పై బిగ్ ఎనౌన్స్ మెంట్ !

Published on May 1, 2021 6:09 pm IST

మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి.

ఇక ఈ సినిమాని అక్టోబర్ లో మొదలుపెట్టి.. వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీను తీసుకోవాలనుకుంటున్నారట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :