ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న ‘సూపర్ స్టార్ కిడ్నాప్’

ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న ‘సూపర్ స్టార్ కిడ్నాప్’

Published on Jun 29, 2015 2:02 PM IST

super-star
గత రెండేళ్లుగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న కొంతమంది యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ వారు సినిమాల్లో స్టార్ హీరోస్ లేకపోయినా సరికొత్త కంటెంట్, ఆసక్తికర టైటిల్స్ తో అందరి చూపును ఆకర్షిస్తున్నారు. అదే కోవలో సుశాంత్ రెడ్డి అనే న్యూ డైరెక్టర్ నుంచి రానున్న మరో సినిమా ‘సూపర్ స్టార్ కిడ్నాప్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు మాస్క్ లతో ముగ్గురు హీరోస్ ని చూపడం, అలాగే మహేష్ ట్యాగ్ లైన్ అయిన సూపర్ స్టార్ ని ఈ టైటిల్ లో వాడుకొని అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సినిమా అత్రైలర్ మరియు ఆడియో రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. అప్పట్లో ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల ఈ సినిమా విడుదలకి నోచుకోలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఎట్టకేలకు ఈ చిత్ర టీం అన్ని అవాంతరాలను తొలగించుకొని ఈ సినిమాని జూలై 3న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్, నందు మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ దాస్ నెగటివ్ పాత్రలో కనిపించనుంది. ఈ టైటిల్ లో ఉన్నట్టుగానే ఓ సూపర్ స్టార్ కిడ్నాప్ చుట్టూ ఈ కథ తిరిగితుంది. దానికి కామెడీ టచ్ ని కూడా జత చేసారు. చందు నిర్మించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు