నా బయోపిక్ తెరకెక్కించగల దర్శకుడు లేడు – కృష్ణ !


బయోపిక్ చిత్రాలు అనగానే ముందుగా మనకు బాలీవుడ్ గుర్తొస్తుంది . హిందీ లో బయోపిక్ చిత్రాలు ఎక్కువగా తెరకెక్కిస్తూ ఉంటారు అక్కడ ఈ చిత్రాలకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది . ఈ మధ్య సౌత్ లో కూడా బయోపిక్ జోరు కొనసాగుతుంది. ముక్యంగా టాలీవుడ్ లో బయోపిక్ సినిమాలు బాగా పెరిగాయి. మహనటి సినిమా విజయం తరువాత ఇప్పుడు అందరు బయోపిక్ సినిమాల ఫై పడ్డారు . తెలుగులో ప్రస్తుతం ,ఎన్టీఆర్ , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి . ఈ మధ్యన అక్కినేని నాగేశ్వర్ రావు గారి జీవిత కథతో ఓ చిత్రం రాబోతుందని వార్తలు వెలువడ్డాయి అవ్వని రూమర్స్ అని నాన్న గారి బయోపిక్ తీయాలనేఆలోచన ప్రస్తుతం లేదని నాగార్జున ఇటీవల ప్రకటించారు.

ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ చర్చలోకి వచ్చింది . నట శేఖర ,సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సుధీర్ బాబు, కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసారు.దీనిలో భాగంగా మీ బయో పిక్ ను ఎవరు డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకి సూపర్ స్టార్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు ఉన్నారని అయితే నా బయోపిక్ ను డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరు లేరని చెప్పారు.దీన్ని బట్టి చూస్తే కృష్ణ బయోపిక్ కూడా లేనట్లే అని తెలుస్తుంది.

Exit mobile version