సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా కరుణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం ఆగస్ట్ 27 వ తేదీన థియేటర్ల లో విడుదల అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడం తో చిత్రం యూనిట్ సంతోషం లో ఉంది.
అయితే ఈ నేపథ్యం లో శ్రీదేవి సోడా సెంటర్ టీమ్ ను సూపర్ స్టార్ మహేష్ అభినందించడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో ఒక మేమరబుల్ మూవీ ను ఇచ్చినందుకు గానూ చిత్ర యూనిట్ ను అభినందించారు మహేష్. ఈ చిత్రం కి సంగీతం మణిశర్మ అందించగా, 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మించారు.


