“మేజర్” వాళ్లకు నచ్చినందుకు సంతోషిస్తున్నాను – సూపర్ స్టార్ మహేష్!

Published on May 30, 2022 12:00 pm IST


అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా మేజర్. ఈ చిత్రం ను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కి సిద్దం అవుతోంది. అయితే విడుదల కి ముందు పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షో లని ప్రదర్శించడం జరిగింది. వైజాగ్ లో నిన్న ప్రీమియర్ షో అనంతరం ప్రీ రిలీజ్ వేడుక ను నిర్వహించడం జరిగింది. ఈ వేడుక కి భారీగా ప్రేక్షకులు, అభిమానులు హాజరు అయ్యారు.

ఈ చిత్రం తమకి బాగా నచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. వైజాగ్ కి మన సినిమా నచ్చింది, నిజంగా ఇది అతి పెద్ద మూమెంట్. బ్లాక్ బస్టర్ రివ్యూ. హానెస్ట్ మూమెంట్, అంటూ చెప్పుకొచ్చారు, అంతేకాక సూపర్ స్టార్ మహేష్ బాబు ను పోస్ట్ లో ట్యాగ్ చేయడం జరిగింది. ఈ మేరకు మహేష్ బాబు స్పందించారు. నాకు నచ్చినట్లు గానే, వాళ్లకు నచ్చినందుకు సంతోషిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు మహేష్. ఈ చిత్రానికి మహేష్ ఒక నిర్మాత గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల అందిస్తున్నారు. జూన్ 3 వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :