“జవాన్” టీమ్ కి సూపర్ స్టార్ మహేష్ బెస్ట్ విషెస్!

Published on Sep 6, 2023 12:05 pm IST


బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం హిందీ లో మాత్రమే కాకుండా, తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం కి గట్టి ప్రమోషన్స్ ను చేసిన మేకర్స్, గ్రాండ్ సక్సెస్ పై ఆశలు పెట్టుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హైప్ ను సొంతం చేసుకుంది జవాన్. ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదిక గా బెస్ట్ విషెస్ తెలిపారు. ఇట్స్ టైమ్ ఫర్ జవాన్. పవర్ ఫుల్ షారుఖ్ ను చూసేందుకు ఎగ్జైట్ అయ్యారు మహేష్. సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలి అని విష్ చేశారు. అంతేకాక కుటుంబ సభ్యులతో సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. సూపర్ స్టార్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి, నయనతార కీలక పాత్రల్లో నటించగా, దీపికా పదుకునే గెస్ట్ రోల్ లో నటించింది.

సంబంధిత సమాచారం :