మరో స్టన్నింగ్ లుక్ తో మహేష్.!

Published on May 28, 2020 1:20 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన ఏజ్ ను రివర్స్ గేర్ లో పెట్టి వెనక్కి లాగేసారా అన్న అనుమానం ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కు కలుగుతుంది. ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎంతో ఆహ్లాదంగా తన కుటుంబంతో గడుపుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా విరివిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన స్టన్నింగ్ లుక్స్ తో ఆశ్చర్యపరుస్తున్నారు.

అలాంటిదే ఇప్పుడు మరొకటి పోస్ట్ చేసారు. తన కూతురు సితారతో కలిసి మిర్రర్ సెల్ఫీ అంటూ అద్దం ముందు నిలుచొని ఇద్దరూ తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి తమ ప్రతిబింబాలను వెతుక్కుంటున్నామంటూ పోస్ట్ చేసారు. ఈ ఫోటో చూస్తే మరోసారి మహేష్ నుంచి ఒక స్టన్నింగ్ పిక్ వచ్చిందని చెప్పక మానరు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో నటించనున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More