కాలా కోసం కలిసివచ్చిన మామా అల్లుడు
Published on Jun 4, 2018 3:15 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, హీరో ధనుష్ నిర్మాణంలో తెరకెక్కిన ‘కాలా’ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతుండటంతో ప్రమోషన్లో భాగంగా రజనీకాంత్, తన అల్లుడు ధనుష్ తో కలిసి ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు.వీరు ‘కాలా’ చిత్రం కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు . ఈ చిత్రంలో రజనీ డాన్ పాత్రలో కనిపించనున్నారు .అలాగే ప్రముఖ హిందీ నటుడు నానా పాటేకర్ రాజకీయ నాయకుని పాత్రలో మరియు నటి ఈశ్వరిరావు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

వుండర్ బార్ పతాకంపై ధనుష్ నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో మరియు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook