వైరల్ అవుతోన్న సూపర్ స్టార్ వీడియో !

Published on Feb 10, 2019 8:11 pm IST

‘సూపర్ స్టార్ రజనీకాంత్’ తన సినిమా కలెక్షన్స్ తోనే కాదు, కుటుంబ సభ్యలు, అభిమానుల మీద తను చూపించే ప్రేమలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సూపర్‌ స్టార్‌ సినిమాల కోసం ఎంతలా ఎదురుచూస్తారో.. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు గురించి అంతకన్నా ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కాగా ప్రస్తుతం రజిని అభిమానులకు మంచి కిక్ ఇచ్చే ఆయన డాన్స్ వీడియో ఒకటి దొరికింది. దాంతో అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే.. రజనీకాంత్ కుమార్తె సౌందర్య, నటుడు విశాగన్ వివాహ సంగీత్ కార్యక్రమంలో రజనీకాంత్ హుషారుగా స్టెప్పులేశారు. ఆయన పాత చిత్రాల్లోని తన డాన్స్ మూమెంట్స్ గుర్తు చేస్తూ అక్కడ ఉన్నవారిని బాగా అలరించారు. ముఖ్యంగా ‘ముత్తు’ సినిమా పాటలకు ఆయన వేసిన స్టెప్పులు చాలా బాగున్నాయి.

సంబంధిత సమాచారం :