సంక్రాంతికి రానున్న సూపర్ స్టార్ సినిమా !

సంక్రాంతికి రానున్న సూపర్ స్టార్ సినిమా !

Published on Jun 13, 2018 9:25 PM IST

ఇటీవలే ‘కాలా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సూపర్ స్టార్ రజనీ కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సినిమా విడుదలరోజే ఇంకొక సినిమాను మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు రజనీ. విభిన్నమైన విజన్ కలిగిన దర్శకుడిగా మంచి పేరున్న యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై పేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి.

వాస్తవానికి దగ్గరగా ఉండే కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 సంక్రాతి కానుకగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, బాబీ సింహ, మేఘా ఆకాష్ లు నటిస్తుండగా రజనీకి జోడీగా అలనాటి స్టార్ హీరోయిన్ సిమ్రన్ నటించనున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు