నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. చాలా రోజుల తర్వాత బాలయ్య కామెడీకి, ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్దపీట వేస్తూ చేస్తున్న సినిమా ఇది. కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి మునుపెన్నడూ చూడని బాలయ్యని తెరపై చూపించేలా ఈ కథని తయారు చేసారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేసి, సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు. సినిమా ప్రారంభం నుంచే ఈ సినిమా ఎలా ఉంటుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్స్ ద్వారా స్టైలిష్ గా ఉంటుందని అర్థమైంది.
తాజాగా ఈ చిత్ర రచయిత కోన వెంకట్ డిక్టేటర్ సినిమా గురించి మాట్లాడుతూ ‘డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణ ఇదివరకూ చేయని ఓ పాత్రలో కపిస్తాడు. అది ఆడియన్స్ ని సర్ప్రై చేస్తుంది. అలాగే ఈ సినిమాలో కిందపడి నవ్వుకునేంత కామెడీ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉంటుంది. చెప్పాలంటే డిక్టేటర్ సినిమా మరోసారి బాలయ్యని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసే సినిమా అవుతుందని’ అన్నాడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.


