రామ్ చరణ్ సినిమాకి సూపర్బ్ ప్రీ బిజినెస్

రామ్ చరణ్ సినిమాకి సూపర్బ్ ప్రీ బిజినెస్

Published on Sep 10, 2015 11:35 PM IST

Ram-charan
శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’. ఈ టైటిల్ కి తగ్గట్టుగానే సినిమాలో కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతాయి పరిచయం చేస్తూ ఇటీవలే ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో రామ్ చరణ్ చేసిన స్టంట్స్ మరియు మాస్ అప్పియరెన్స్ అభిమానులకి బాగా నచ్చడమే కాకుండా సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా రెండు టీజర్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు అనగానే అంచనాలు ఆకాశానికి తాకాయి.

ఇన్ని స్పెషాలిటీస్ ఈ సినిమాకి తోడవడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. అంతే కాకుండా ప్రతి ఏరియాలోనూ రికార్డ్ ప్రైజ్ పెట్టి కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. నిర్మాతలు కూడా భారీ మొత్తానికి రైట్స్ అమ్మడానికి నిర్ణయించుకొని అత్యధిక ప్రైజ్ ఫిక్స్ చేసినా డిస్ట్రిబ్యూటర్స్ వెనకాడకపోవడం విశేషం. ఒక్క లోకల్ లోనే కాదు ఓవర్సీస్ లో కూడా రామ్ చరణ్ మునుపటి సినిమాల కంటే బాగా ఎక్కువ రేటుకి అమ్ముడు పోయినట్లు సమాచారం. దీని ప్రకారం సినిమా రిలీజ్ కి ముందే నిర్మాతలకి బ్రూస్ లీ టేబుల్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టేలా ఉంది.

ప్రస్తుతం ఈ చిత్ర టీం రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ చరణ్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు