‘డైనమైట్’ ప్రమోషనల్ టూర్‌కు సూపర్ రెస్పాన్స్

‘డైనమైట్’ ప్రమోషనల్ టూర్‌కు సూపర్ రెస్పాన్స్

Published on Aug 30, 2015 2:51 PM IST

vishnu
మోహన్ బాబు తనయుడిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, హీరోగానే కాక నిర్మాతగానూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణు, ప్రస్తుతం ‘డైనమైట్’ సినిమా ద్వారా మనముందుకు రానున్న విషయం తెలిసిందే. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ లాంటి అర్థవంతమైన సినిమాలను తెరకెక్కించిన దేవాకట్టా డైనమైట్‌కు దర్శకత్వం వహించారు. తమిళ సూపర్ హిట్ ‘అరిమ నంబి’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఈ సినిమాను స్వయంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధమైంది.

ఇక సినిమా విడుదలకు వారం రోజులే ఉండడంతో డైనమైట్ యూనిట్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. హీరో విష్ణు స్వయంగా ఓ ప్రమోషనల్ టూర్‌లో పాల్గొంటూ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ఆగష్టు 28న మొదలైన ఈ టూర్ ప్రస్తుతం పలు ప్రాంతాల్లో జోరుగా జరుగుతోంది. నిన్ననే విష్ణు వరంగల్‌లోని వెయ్యి స్థంభాల ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు అక్కడి జనాలతో కలిసి డైనమైట్ సినిమా ప్రచారాన్ని చేపట్టారు. ప్రమోషనల్ టూర్‌కు వస్తోన్న రెస్పాన్స్ పట్ల విష్ణు చాలా ఆనందంగా ఉన్నానని తెలిపారు. అన్నిచోట్లా సినిమా యూనిట్‌కు మంచి స్వాగతం లభిస్తుండడం విశేషం.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయగా, తాజాగా సినిమా యూనిట్ చేపట్టిన ప్రమోషన్ కూడా సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. మంచి సస్పెన్స్ ఎలిమెంట్‌తో నడిచే స్క్రీన్‌ప్లే బేస్‌డ్ సినిమాగా డైనమైట్ కనిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ సినిమాలో విష్ణు సరసన ప్రణీత హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు